News January 11, 2026
గంగూలీని దాటేసిన కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో గంగూలీ(308)ని దాటేశారు. ఇవాళ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆయనకు 309వ వన్డే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ జాబితాలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్(463) టాప్‌లో ఉన్నారు. ఇతర భారత ప్లేయర్లు ధోనీ(347), ద్రవిడ్(340), అజహరుద్దీన్(334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ WC-2027 ఆడినా ధోనీని కోహ్లీ దాటడం కష్టమే.
Similar News
News January 15, 2026
ఎన్టీఆర్ అదిరిపోయే లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చారు. బియర్డ్ లుక్‌లో సూపర్బ్ స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన భారీగా గడ్డం పెంచారు. తాజాగా కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పలువురు SMలో షేర్ చేశారు. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News January 15, 2026
ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.
News January 15, 2026
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.


