News May 7, 2025
గంజాయి కేసుల్లో నిందితుడి ఆస్తులు సీజ్: CI దీనబంధు

గంజాయి కేసుల్లో నిందితుడి ఆస్తులను సీజ్ చేశారు. ముంచంగిపుట్టు మం. దోడుపుట్టు పంచాయతీ గత్తురుమండకి చెందిన కిల్లో వాసుదేవ్ గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వాసుదేవ్ పాడేరులో నివాసం ఉంటున్నాడని CI దీనబంధు శుక్రవారం తెలిపారు. వాసుదేవ్ భార్య, బంధువుల పేర్లపై రూ.1.40 కోట్లు (గంజాయి ద్వారా వచ్చిన ఆస్తులు) ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలడంతో వాటిని సీజ్ చేశామన్నారు.
Similar News
News February 11, 2026
ADB: అడవిని తలపించిన మోడల్ పోలింగ్ కేంద్రం

మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలోని 47వ వార్డు సైన్స్ డిగ్రీ కళాశాలలో అడవిని తలపించేలా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. వన్యప్రాణుల సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి స్మిల్కాతో కలిసి పరిశీలించారు. వినూత్నంగా రూపొందించిన ఈ కేంద్రం ఓటర్లలో ఆసక్తిని రేకెత్తించింది.
News February 11, 2026
వికారాబాద్: తొలిసారి ఓటేసిన విద్యార్థిని

వికారాబాద్ జిల్లా ఆలంపల్లి గ్రామంలో ఓ విద్యార్థిని తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమవ్వడం గర్వంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.


