News March 31, 2024
గంజాయి మత్తులో యువకుడిపై దాడి

నాయుడుపేటలో గంజాయి మత్తులో యువకుడిపై ఆదివారం దాడి జరిగింది. ఓజిలి మండలం గ్రద్దగుంట, నాయుడుపేట మండలం విన్నమాలకు చెందిన కొందరు బీడీకాలనీలో గంజాయి తాగారు. ఈక్రమంలో వారి మధ్య ఘర్షన జరిగింది. మత్తులో గ్రద్దగుంట యువకుడిపై విన్నమాల యువకుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News February 12, 2026
పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.
News February 12, 2026
నెల్లూరులో పరీక్ష ఫీజులు ఇలా..!

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 2023-25, 2024-26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈనెల 17వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు డీఈవో బాలాజీరావు కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒకదానికి రూ.100 చెల్లించాలని సూచించారు.
News February 12, 2026
నెల్లూరు కలెక్టరా.. మజాకా!

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తనదైన మార్క్ చూపించారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ అనే సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.500 కోట్లతో ఏరో స్పేస్ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించింది. అక్కడ భూమి, ఇతర అనుమతులకు సంస్థ ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. వెంటనే నెల్లూరు కలెక్టర్ ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో దుత్తలూరు మండలంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు.


