News October 7, 2025

గండికోట మర్డర్.. నిందితులు ఎవరో తెలిసేనా?

image

గండికోటలో ఇంటర్ అమ్మాయి మృతి అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో కదలిక వచ్చింది. బాలిక బంధువులు ఇద్దరు, ఆమె ఫ్రెండ్‌‌‌ని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధమని ఆ ముగ్గురు ప్రకటించడంతో నిన్న వారిని పోలీసులు విజయవాడకు తీసుకెళ్లారు. ఈనెల 9 లేదా 10న ఈ టెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే బాలిక చనిపోయి 80 రోజులు దాటింది. ఈసారైనా నిందితులు ఎవరనేది తెలుస్తోందో? లేదో చూడాలి మరి.

Similar News

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.

News January 14, 2026

మేడారం గద్దెల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..!

image

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలో ప్రాంగణంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లుల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరెంటు వైరు పలుచోట్ల తెగి కనిపించడంతో పాటు అతుకులుగా ఉన్నాయి. భక్తులు ఎవరైనా చూసుకోకుండా వాటిపై కాలు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

News January 14, 2026

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

image

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.