News August 3, 2024

గండీడ్: SBI ఏటీఎంలో దొంగలు బీభత్సం

image

SBI బ్యాంకు ATMలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించిన ఘటన గండీడ్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ గాంధీ నాయక్, ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నేడు తెల్లవారుజామున మొహానికి గుడ్డలు కట్టుకొని ATMను కాల్చి దొంగతనానికి ప్రయత్నించారని, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామన్నారు. క్లూస్ టీమ్స్ సహాయంతో దొంగలను వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

Similar News

News December 13, 2025

పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

సిరి వెంకటాపూర్‌లో అత్యంత ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి, దోనూరు, కోయిలకొండ మండలం పారుపల్లి 10.6, మిడ్జిల్ 10.9, మహబూబ్‌నగర్ గ్రామీణం 11.0, దేవరకద్ర, రాజాపూర్ 11.1, మహమ్మదాబాద్, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.