News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 19, 2026

మేడారం జాతరలో రూ.90.87 కోట్ల పనులు!

image

మేడారం జాతరలో అభివృద్ధి పనులకు రూ.251 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. రూ.101 కోట్లు గ్రానైట్‌‌‌ గద్దెల కోసం, మిగిలిన రూ.150 కోట్లతో రహదారులు, తాగునీటి సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు. ప్రస్తుతం జాతరలో PR శాఖ రూ.13.10 కోట్లు, R&B రూ.48.64 కోట్లు, ఇరిగేషన్ రూ.5.90 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ రూ.8.08 కోట్లు, RWS రూ.15.15 కోట్లు మొత్తం రూ.90.87 కోట్ల పనులు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

News January 19, 2026

దావోస్‌కు సీఎం.. సింగపూర్ అధ్యక్షుడితో భేటీ

image

AP: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సమావేశం అయ్యారు. అంతకుముందు జ్యురిచ్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.

News January 19, 2026

మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

image

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.