News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 15, 2026

‘పెద్ద తప్పు చేశా.. కాపాడండి!’: పాక్ నుంచి సిక్కు మహిళ ఆవేదన

image

తీర్థయాత్ర కోసం పాక్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్న సరబ్‌జీత్ కౌర్ అనే భారతీయ మహిళ ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘నేను పెద్ద తప్పు చేశాను. ఇక్కడ నా పరిస్థితి బాలేదు. తిండికి, బట్టలకు కూడా ఇబ్బంది పడుతున్నాను. పిల్లల దగ్గరకు వచ్చేస్తా. నన్ను ఇక్కడ వేధిస్తున్నారు. దయచేసి ఇండియాకు తీసుకెళ్లండి’ అంటూ భారత్‌లో ఉన్న తన భర్తకు ఆమె పంపినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి SMలో వైరలవుతోంది.

News January 15, 2026

సిద్దిపేట: పండగ పూట తీవ్ర విషాదం.. బాలుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో <<18858521>>బాలుడు మృతి<<>> చెందిన సంఘటన సిద్దిపేట రాజీవ్ రహదారిపై జరిగింది. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపిన వివరాలు.. చేర్యాల మం. చిట్యాలకు చెందిన దీపక్ చారి, భార్య లత, కూతురు, కొడుకుతో కలిసి సిద్దిపేటలో ఉంటున్నాడు. పండగకు కుటుంబంతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీ కొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.

News January 15, 2026

సంక్రాంతి వేళ HYDలో DANGER

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.