News November 19, 2025
గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 13, 2026
కామారెడ్డి: సమ్మె బాటలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు

గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాటకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్య కు సమ్మె నోటీసు అందించారు. వారు మాట్లాడుతూ.. రేయింబవళ్ళు కష్టపడుతున్న తమకు వేతనాలు సరైన సమయానికి అందించకపోవడమే కాకుండా తాత్సారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆమెకు తెలిపారు.
News January 13, 2026
కోదాడ: 3 ముక్కలుగా విరిగిన కోడి తొడ.. ఎముకకు పిన్నింగ్‌తో జాయింట్

కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య మూగ జీవాలకు వినూత్న చికిత్సలు చేసి వాటికి ప్రాణం పోస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ముక్కలుగా విరిగిన కోడి తొడ ఎముకలకు పిన్నింగ్ ద్వారా అతికించి కోడి తిరిగి యధావిధిగా నడిచే విధంగా చికిత్స అందించారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస రావు.. డాక్టర్ పెంటయ్య వినూత్న చికిత్సా విధానాన్ని అభినందించారు.
News January 13, 2026
సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.


