News November 19, 2025

గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

image

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 25, 2026

ఆకర్షణీయంగా ముస్తాబైన తిరుపతి కలెక్టరేట్

image

గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ త్రివర్ణ విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. రాత్రి వేళల్లో కలెక్టరేట్ భవనం నలువైపులా ఈ మూడు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులు విరజిమ్ముతూ అత్యంత సుందరంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.

News January 25, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.

News January 25, 2026

విడవలూరు: 54 మంది అరెస్ట్

image

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.