News March 27, 2024
గంభీరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో పలు కంపెనీలు హాజరవుతున్నాయని, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.
Similar News
News February 17, 2026
కరీంనగర్: ‘అధికారుల్లో జవాబుదారితనానికి ఆర్టీఐ కీలకం’

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు సమాచార హక్కు చట్టం (RTI) దోహదపడుతుందని రాష్ట్ర సమాచార కమిషనర్లు స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దరఖాస్తుదారులకు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించడమే కమిషన్ లక్ష్యమని కమిషనర్లు శ్రీనివాసరావు, అయోధ్యరెడ్డి, మోసినా పర్వీన్, భోపాల్ పేర్కొన్నారు. చట్టం పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.
News February 17, 2026
KNR: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలు, గోదాములను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు మరియు నిల్వల రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. యూరియా కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడి, బుకింగ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 17, 2026
కరీంనగర్ ‘నగరాధిపత్యం’ కమలం వశం!

కరీంనగర్ మున్సిపల్ పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం సాధించింది. మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. బండి సంజయ్ వ్యూహంతో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా పీఠమెక్కారు. దశాబ్ద కాలం నగరాన్ని ఏలిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమై ఉనికి కోసం పోరాడుతోంది. ప్రస్తుతం జిల్లా రాజకీయం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.


