News December 1, 2025

గంభీర్.. ఏం స్ట్రాటజీ ఇది?

image

చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా SAపై భారత్ తొలి వన్డే గెలిచింది. అయితే IND బ్యాటింగ్ ఆర్డర్‌, ప్లేయింగ్ 11పై విమర్శలొస్తున్నాయి. పంత్‌ను ఎందుకు తీసుకోలేదు? రుతురాజ్ నం.4 ఏంటి? రాహుల్ కంటే ముందు బ్యాటింగ్‌కు సుందర్‌ ఎందుకు? అని క్రీడా విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఛేంజెస్ పెద్దగా వర్కౌట్ కాలేదని, గంభీర్ ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదంటున్నారు. దీనిపై మీ COMMENT.

Similar News

News February 13, 2026

తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

image

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.

News February 13, 2026

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. UPDATES

image

*యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
*కాగజ్‌నగర్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
*ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా) 13, 15వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం
*కొల్లాపూర్ 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 4, 11, 12 వార్డుల్లో BRS విజయం
*రామాయంపేట పదో వార్డులో BRS గెలుపు

News February 13, 2026

పిల్లలకు పాలు అరగాలంటే..!

image

పసిపిల్లలు పాలు తాగిన తర్వాత కచ్చితంగా బర్పింగ్ చేయించాలి. లేదంటే వారు తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లలను బర్పింగ్ చేయించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని సున్నితంగా భుజంపై పెట్టుకొని నెమ్మదిగా వీపును సవరదియ్యాలి. లేదంటే బేబీని ఒళ్లో కూర్చోబెట్టుకొని కాస్త ముందుకు వంచి వీపును సవరదియ్యాలి. ఇలా త్రేన్పులు వచ్చే వరకు చెయ్యాలని చెబుతున్నారు.