News February 16, 2025

గజ్వేల్: గురుకులాల్లో సౌకర్యాల విషయంలో రాజీపడొద్దు: కలెక్టర్

image

గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు సౌకర్యాల విషయంలో ఎటువంటి రాజీపడకుండా కొత్త డైట్ మెనూ ప్రకారం భోజన వసతి అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. శనివారం గజ్వెల్ ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాతూరులో గల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

Similar News

News March 9, 2026

గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

image

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.

News March 9, 2026

పాసర్లపూడిలో దారుణం.. డ్రైన్‌లో శిశువు మృతదేహం PHOTO

image

మామిడికుదురు మండలం పాసర్లపూడి బొమ్మిడిపాలెం వాడబోది డ్రైన్‌లో వారం రోజుల మగ శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ చైతన్య కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 9, 2026

పోలీస్ శాఖ PGRSను సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు వివరించారు.