News February 3, 2025
గజ్వేల్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమవిఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపాకలో జరిగింది. ఎస్ఐ వివరాలు.. కొండపాకకు చెందిన ప్రశాంత్(29) శనివారం రాత్రి బయటకు వెళ్తున్నానని తండ్రి ఎల్లయ్యకు చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం పొలానికి వెళ్లిన ఎల్లయ్యకు ప్రశాంత్ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ప్రశాంత్ ఫోన్‌ను పరిశీలించగా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2026
రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
News March 14, 2026
KNR: బాలికతో వివాహం.. కేసు నమోదు: ఎస్‌ఐ

KNR(D) శంకరపట్నం మండలంలో ఓ బాలికకు బాల్య వివాహం చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చెన్నూరి పద్మ ఇచ్చిన పిటిషన్ మేరకు, ముద్రవేణి సంపత్, శోభల కుమారుడు ముద్రవేణి రాజ్ కుమార్‌కు బాలికతో చట్టవిరుద్ధంగా వివాహం నిర్వహించారు. దీంతో బాలిక తల్లిదండ్రులపై, సంపత్, శోభా, రాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2026
రొద్దంలో గ్యాస్ గోదాము తనిఖీ

రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదామును జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిల్వలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. డోర్-టు-డోర్ డెలివరీ విధానాన్ని పరిశీలించి వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి అందుతున్నాయా అని తెలుసుకున్నారు.


