News November 19, 2025

గజ్వేల్: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గజ్వల్ మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ-ఫిజిక్స్, పీజీటీ-మాథ్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. దరఖాస్తులను గజ్వేల్ కళాశాలలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అందివ్వాలన్నారు. మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తామన్నారు.

Similar News

News January 17, 2026

RCB అభిమానులకు గుడ్‌‌న్యూస్

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.

News January 17, 2026

ఓటు హక్కు వినియోగించుకునేలా కార్యక్రమాలు: MNCL కలెక్టర్

image

ఈ నెల 25న 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఓటర్ దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. “నా భారత్ -నా ఓటు” అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. నూతన ఓటర్లను గుర్తించి వారికి ఓటు గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.

News January 17, 2026

విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.