News February 7, 2025
గజ్వేల్: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 16, 2026
ఇంత దానికేనా అంత డ్రామా!

T20 WCలో భారత్-పాకిస్థాన్ మ్యాచులో వార్ వన్ సైడ్ అయింది. టీమ్ ఇండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక దాయాది తేలిపోయింది. దీంతో టోర్నీకి ముందుకు పాక్ ‘బాయ్‌కాట్’ డ్రామా ఆడింది ఇందుకేనా అంటూ భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ఇండియాతో ఆడబోమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. టోర్నీలో USA లాంటి చిన్న జట్లు మంచి పోటీ ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
పాలమూరు వర్సిటీ: రీకౌంటింగ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఫలితాలపై సందేహాలున్న వారు సబ్జెక్టుకు రూ.300 చొప్పున ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించాలని అధికారులు సూచించారు.


