News December 3, 2025
గట్టమ్మ వద్ద రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎస్పీ

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ముందుగా జాకారం సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గట్టమ్మ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News February 19, 2026
HYD: ‘సెటిల్’ అంటే పెళ్లి కాదు

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.
News February 19, 2026
వరుణ్.. నువ్వో వరం!

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
News February 19, 2026
బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికకు వస్తున్న ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు రువ్విన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. అసలు అక్కడ గొడవ జరగలేదని.. సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోలేదని, కావాలనే తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు.


