News September 12, 2025
గట్టు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..!

గట్టు మండలం ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ శుక్రవారం గట్టు సల్కాపురం గ్రామాల మధ్య పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యాన్‌లో 20 మంది విద్యార్థులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వ్యాన్ వరి పొలంలో కూరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు అంటున్నారు.
Similar News
News December 6, 2025
ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్‌కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్‌ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.
News December 6, 2025
బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.


