News November 19, 2025
గడిచిన 5 నెలల్లో 1558 మందిపై కేసులు: బాపట్ల ఎస్పీ

విద్యాసంస్థల సమీపంలో గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలను సంబంధిత పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీ చేశారన్నారు. గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న 80 మందిపై COTPA చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గడిచిన 5 నెలల నుంచి 1558 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News January 24, 2026
HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.