News September 12, 2025
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

RGM నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆలస్యమైతే ఖర్చులు పెరిగి భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. GP భవనాలు, అంగన్వాడీలు, శానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, పాఠశాల టాయిలెట్స్, R&B రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
Similar News
News December 8, 2025
కృష్ణా: ‘వేతనాలు చెల్లిస్తేనే పనులకు వస్తాం’

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 నెలలుగా ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిలు విడుదల కాకపోవడంతో 4.23 లక్షల మంది శ్రామికులు ఇబ్బంది పడుతున్నారు. వేతనాలు చెల్లిస్తేనే పనులకు వస్తామని కూలీలు తేల్చి చెప్పడంతో నరేగా (NREGS) పనుల పురోగతి నిలిచింది. చట్టం ప్రకారం 15 రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు నిలిచిపోవడంపై క్షేత్ర స్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 8, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


