News August 22, 2025

గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

Similar News

News January 17, 2026

పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

image

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

News January 17, 2026

కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఆ వర్గానికే..

image

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో మేయర్ పీఠం ఎస్టీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మెజారిటీ జనాభా ఏజెన్సీ వాసులు కావడంతో, జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డ మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News January 17, 2026

BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ

image

ఈ నెల 21న నాగపూర్‌లో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ–20 మ్యాచ్‌కు BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) సెక్రటరీ ఎం. రవీంద్ర చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆయనకు అభినందనలు తెలిపింది. గత 40 సంవత్సరాలుగా క్రికెట్‌కు అందిస్తున్న సేవలకు ఇది తగిన గుర్తింపుగా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.