News September 12, 2025
గణపవరం: రోడ్డు ప్రమాదంలో వీఆర్‌వో మృతి

రోడ్డు ప్రమాదంలో గణపవరం మండలం ఎస్. కొండేపాడు వీఆర్‌వో అడబాల కనక దుర్గా ప్రసాద్ (50) మృతి చెందారు. పిప్పర వద్ద శుక్రవారం బైక్ పై వెళ్తున్న దుర్గా ప్రసాద్‌ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు. గణపవరం ఎస్ఐ ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు వీఆర్‌వో స్వస్థలం వీరేశ్వరపురం గ్రామం.
Similar News
News December 11, 2025
మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 11, 2025
రోడ్లు, వంతెనలు అభివృద్ధిపై పార్లమెంట్‌లో ఎంపీ వినతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి డెల్టా ప్రాంతంలో కీలక రహదారులు, వంతెనలు అభివృద్ధి చేయాలని లోకసభలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కోరారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అనేక గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతాలు కూడా ఉన్నాయని వీటిలో మత్స్యకారులు అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు చిన్న చిన్న రహదారులు, ఇరుకైన వంతెనలే ఆధారమని తెలిపారు
News December 11, 2025
MBNR: మల్లేపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు లింగం గెలుపు

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ తొలి ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లింగం 364 ఓట్ల మెజారిటీతో మరో అభ్యర్థి కావలి భాస్కర్‌పై గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు లింగంకు అభినందనలు తెలిపారు.


