News August 21, 2025

గణేశ్ ఉత్సవాలకు ఇబ్బందులు లేకుండా GHMC చర్యలు

image

వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో దెబ్బతిన్న క్యాచ్ పిట్‌లు, మ్యాన్‌హోల్స్ మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు గుర్తించిన 11,741 పాట్ హోల్స్‌లో 8,330కి మరమ్మతులు పూర్తి చేయగా.. అదనంగా 434 క్యాచ్ పిట్‌లకు మరమ్మతులు చేశామన్నారు.

Similar News

News January 13, 2026

కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.

News January 13, 2026

భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

image

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.

News January 13, 2026

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>తమిళనాడు <<>>మర్కంటైల్ బ్యాంక్‌ లిమిటెడ్ 20 బ్రాంచ్ హెడ్ (మేనేజర్, సీనియర్ మేనేజర్, AVP) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.ib.tmbonline.bank.in