News March 4, 2025
గతంలో తిరిగిన దారుల్లోనే పులి మరోసారి సంచారం!

గత 20 రోజులకు పైగా పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నస్తూర్‌పల్లి అడవుల్లో సంచరించిన పులి.. అన్నారం అడవుల మీదుగా గుండ్రాత్‌పల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ స్వాతి, పలువురు అధికారులతో కలిసి అడవిలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి గతంలో తిరిగిన దారుల్లోనే తిరుగుతోంది.
Similar News
News December 6, 2025
గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.
News December 6, 2025
సారవకోట: మద్యం డబ్బుల కోసం గొడవ.. వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.
News December 6, 2025
వడ్లమానులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శుభశేకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు నర్సరీకి సమీపంలో గుర్తు తెలియని 65 ఏళ్ల వయోవృద్ధుడు మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.


