News April 26, 2024

గతంలో YCP నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి: పెమ్మసాని

image

గతంలో తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని గుంటూరు టీడీపీ MP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో నరసరావుపేట, గుంటూరు ఎంపీ టికెట్లు.. రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. తన ఐడీయాలజీకి సరిపోని పార్టీ వైసీపీ అని చెప్పారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు తన వల్ల సమాజానికి మేలు జరుగుతుందని టికెట్ ఇచ్చినట్లు వివరించారు.

Similar News

News April 14, 2026

GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

image

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2026

GNT: మిర్చి రాకలు తగ్గుదల.. యార్డుకు దెబ్బ

image

గుంటూరు మిర్చి యార్డులో ఈ సీజన్‌లో రాకలు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకు 2 లక్షల టిక్కీలు వచ్చేవి. ఇప్పుడు సగటు 1.30 లక్షలకే పరిమితం అవుతున్నాయి. సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్ల నుంచి 90 వేల హెక్టార్లకు తగ్గింది. గత సీజన్‌లో ధరలు లేకపోవడం, వాతావరణ ప్రభావం కారణాలుగా చెబుతున్నారు. యార్డు ఆదాయం కూడా ప్రభావితమైంది. గత ఏడాది రూ.20 కోట్ల లోటు రాగా, ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతోంది.

News April 13, 2026

GNT: అక్రమ విద్యుత్.. రూ.12.93 లక్షల ఫైన్

image

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా సోమవారం విద్యుత్ సర్వీసుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాయి. D13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్ నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది, 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న 190 సర్వీసులపై రూ.12.93లక్షల అపరాధ రుసుం విధించారు.