News January 20, 2026
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

TG గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 JAN 1 నుంచి DEC 31 మధ్య CBFC ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నారు. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
Similar News
News February 17, 2026
ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అంటే?

ట్రెండ్ అయ్యే ప్రతి హెయిర్ స్టైల్ అందరికీ సెట్ కాదంటున్నారు నిపుణులు. ఫేస్ షేప్‌ని బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోవాలంటున్నారు. రౌండ్, స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్నవారికి బ్యాంగ్స్ బావుంటాయి. జుట్టు కెరటాల్లా అందంగా కనిపించాలంటే లాంగ్ కర్టెన్ బ్యాంగ్స్ చేయించుకోవాలి. రౌండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ బావుంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా కనిపించడంతో పాటు అన్ని డ్రెస్సుల మీదకీ సెట్ అవుతుంది.
News February 17, 2026
23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.
News February 17, 2026
సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్ (కోల్‌కతాలో)తో తలపడనుంది.


