News October 7, 2025
గద్వాలలో విషాదం.. బావిలో మునిగి వ్యక్తి మృతి

గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపేటకు చెందిన రామాంజనేయులు (50) బంధువుల ఓ బాలుడికి ఈత నేర్పించే క్రమంలో లింగం బావిలోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
రక్తంతో నారా లోకేశ్ చిత్రం

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో మంత్రి నారా లోకేశ్ చిత్రాన్ని గీశారు. లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ వినూత్న చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. లోకేశ్ తెలుగు ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శ్రీనివాసులు ఆకాంక్షించారు.
News January 23, 2026
ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

రాబోయే మూడేళ్లలో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలకు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
News January 23, 2026
జైలు నుంచి జోగి రమేశ్, రాము విడుదల

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన YCP నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 85రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి తంబళ్లపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ‘జైలులో మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. అక్రమ కేసులకు మేం భయపడం. రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకోండి. జగన్‌ను మళ్లీ CM చేసేదాకా కొదమసింహాల్లా పనిచేస్తాం’ అని విడుదల అనంతరం జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.


