News August 11, 2025
గద్వాలలో స్వాతంత్ర్య దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి ఏయే కార్యక్రమాలు చేపట్టాలో ఏయే శాఖల అధికారులు ఏయే బాధ్యతలు తీసుకోవాలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 16, 2026
KMR: ఇంటర్ పరీక్షలకు 95.10 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


