News March 15, 2025

గద్వాల్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.

News February 16, 2026

ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

News February 16, 2026

బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.