News November 6, 2025
గద్వాల్: మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు- SP

జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ ఆకతాయిలకు చెక్ పెడుతుందని ఎస్పీ శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి సేఫ్‌గా ఉండాలని అన్నారు. మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News January 22, 2026
రహదారి భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత: విష్ణు చరణ్

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతీ పౌరుడి బాధ్యత అని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 22, 2026
మీరు మా వల్లే బతుకుతున్నారు.. కెనడా PMపై ట్రంప్ ఫైర్

దావోస్ వేదికగా కెనడాపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘US వల్లే కెనడా బతుకుతోంది. మా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మార్క్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ ఆర్థిక శక్తిని వాడుకుని ఇతర కంట్రీస్‌ను భయపెడుతున్నాయని, అందుకే మధ్యస్థ దేశాలన్నీ ఏకం కావాలని కెనడా PM మార్క్ కార్నీ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ సీరియస్ అయ్యారు.
News January 22, 2026
రేపు భక్తులకు అమ్మవారి జోగులాంబ నిజరూప దర్శనం

వసంత పంచమి పురస్కరించుకొని రేపు అలంపూర్ పట్టణంలోని ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. అలంపూర్ పట్టణంలో మహిళలు రేపు పెద్ద సంఖ్యలో పంచామృత కలశాలతో పట్టణంలో ఊరేగింపుగా వచ్చి శ్రీ జోగులాంబ అమ్మవారికి కలశాభిషేకం చేసి దర్శించుకొనున్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమిన జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.


