News March 4, 2025

గద్వాల: కుటుంబ కలహాలతో మహిళ మృతి

image

మల్దకల్ మండలం అమరవాయికి చెందిన ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన బుచ్చమ్మ(42), జమ్మన్న దంపతులకు ముగ్గురు సంతానం. వీరు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవలే కుమారుడి వివాహం చేయగా, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పాటు కుటుంబ కలహాలు ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేనప్పుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.

News December 10, 2025

MBNRలో హై ఓల్టేజ్ ఫైట్.. తండ్రి, కూతురు ఢీ

image

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ జనరల్ స్థానం కోసం తండ్రి ముద్ధం రాములు, కూతురు ముద్ధం నవ్య శ్రీలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వీరిద్దరే బరిలో నిలవడం విశేషం. అంతేకాక, వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 17న కొల్పూర్ ఎన్నికల ఫలితం వెల్లడికానుంది.

News December 10, 2025

కృష్ణా: లంచాల భయం.. బీపీఎస్ మాకొద్దు బాబోయ్!

image

విజయవాడ, తాడిగడప, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నంలో అనధికార కట్టడాలు కోకొల్లలు. ఒక్క విజయవాడలో 10 వేలకు పైగా నిర్మాణాలు ఉంటే మిగతా చోట్ల 2వేల వరకు ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రెగ్యులరైజేషన్‌కు ఎవరూ ముందుకు రావడం లేదు.