News May 7, 2025
గద్వాల జిల్లాలో ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు

జిల్లాలో మౌలిక వసతులను కల్పిస్తే ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని అకాడమిక్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా అన్నారు. శుక్రవారం ఆయన గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో మౌలిక వసతులను కల్పిస్తామని సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సంతోశ్‌లు అన్నారని ఆయన చెప్పారు. విజయ్, బాబు నాయుడు ఉన్నారు.
Similar News
News February 17, 2026
JGTL: కాంగ్రెస్‌లో ‘జీవన్’ సెగ.. పార్టీ మార్పు తప్పదా?

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.
News February 17, 2026
పాలమూరు: కాంగ్రెస్ ఖాతాలోకి 17 ఛైర్మన్, 1 మేయర్

ఉమ్మడి పాలమూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/ మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (INC) 17 ఛైర్మన్, 1 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 2 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFB(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లకు చెరొకటి ఛైర్మన్ స్థానాలు దక్కాయి.
News February 17, 2026
₹34,855 కోట్లు.. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఇది!

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్‌లైన్ ఫ్రాడ్‌తో నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ₹34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. అందులో ₹12,230 కోట్లను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలపై నమోదైన 234 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులతో దోచుకుంటున్నట్లు వెల్లడించారు.


