News December 2, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News February 17, 2026
ఫ్లెక్సీల ఏర్పాటుపై కలెక్టర్ కీలక ఆదేశాలు

ఫ్లెక్సీల ముద్రణలో చట్టపరమైన అనుమతులు తప్పనిసరిగా పాటించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఫ్లెక్సీల వల్ల ఉత్పన్నమవుతున్న శాంతిభద్రతల సమస్యలు, పర్యావరణ ఇబ్బందులపై చర్చించారు. ప్రజలకు ఆటంకం కలగకుండా నిబంధనల మేరకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News February 17, 2026
అమలాపురం: చదరంగంలో మీ సత్తా చూపండి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ‘షాప్ లీగ్’ చదరంగం పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు మల్టీ స్పోర్ట్స్ లీగ్ నిర్వహిస్తోందని తెలిపారు. 12 నుంచి 20 ఏళ్ల వయసున్న క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన యువతను వెలికితీయడమే లక్ష్యమని కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పేర్కొన్నారు.
News February 17, 2026
నెల్లూరు మేయర్‌గా మరోసారి మహిళకే ఛాన్స్!

నెల్లూరు మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్‌కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.


