News December 1, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News February 18, 2026
పార్వతీపురం: ‘సీఎస్సీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

పార్వతీపురం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎస్సీల నిర్మాణాలపై సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<
News February 18, 2026
విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)- నహర్లగన్(NHLN) మధ్య ప్రత్యేక రైళ్లు(నం.07046,47) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8:30 గంటలకు S.Cలో బయలుదేరే ట్రైన్(నం.07046) అదే రోజు మధ్యాహ్నం 2:25కి విజయవాడ చేరుకుంటుందన్నారు, మార్చి 4న మధ్యాహ్నం 1:50కి విజయవాడలో బయలుదేరే ట్రైన్ నం.07047 రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.


