News August 11, 2025

గద్వాల జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

image

గద్వాల జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అలంపూర్ మండలంలో అత్యధికంగా 71.9 మిల్లీమీటర్లు, తక్కువగా గద్వాల మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేటీదొడ్డి 7.3, ఇటిక్యాల 28.0, మల్దకల్ 7.6, గట్టు 41.3, అయిజ 19.3, రాజోలి 30.5, వడ్డేపల్లి 40.5, మానవపాడు11.3, ఉండవెల్లి 64.5, ధరూర్‌లో 5.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Similar News

News March 12, 2026

జగన్‌కు మంత్రి సవిత వార్నింగ్!

image

కూటమిపై బురద జల్లడం మానుకోవాలని జగన్‌కు మంత్రి సవిత హితువు పలికారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అన్నారు. ఆయనకు విజన్ లేదని, రాష్ట్రం గురించి ఆలోచన లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసినా జగన్ పారిపోయాడన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

News March 12, 2026

కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

image

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.

News March 12, 2026

అనంతపురం జిల్లాలో 2,75,642 మంది రైతులు అర్హులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్‌కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.