News August 12, 2025

గద్వాల జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

image

గద్వాల జిల్లాలో 5 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మంగళవారం మల్దకల్ మండలంలో ఎక్కువగా 29.5 మిల్లీమీటర్ల వర్షం కురువగా తక్కువగా ఉండవల్లిలో 3.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేటిదొడ్డి 28.1, ధరూర్ 19.6, గద్వాల 23.0, ఇటిక్యాల 25.0, గట్టు 16.3, అయిజ 8.0, రాజోలి 10.5, వడ్డేపల్లి7.8, మానవపాడు 5.0, అలంపూర్ 16.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 16.1 మిల్లీమీటర్లుగా నమోదు అయింది.

Similar News

News March 6, 2026

దీదీకి కొత్త తలనొప్పి?

image

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

News March 6, 2026

మంచిర్యాల: 9న అప్రెంటిస్ షిప్ మేళా

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై.రమేశ్ తెలిపారు. 11 ప్రముఖ కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయన, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటలకు నిర్వహించనున్న అప్రెంటీషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 6, 2026

కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.