News August 21, 2025
గద్వాల జిల్లాలో 20.7 మిల్లీమీటర్ల వర్షం

గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 20.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గట్టులో 16.1, మానవపాడు 0.3, మల్దకల్ 4.0, ఎర్రవల్లి 0.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే కేటి దొడ్డి, ధరూర్, గద్వాల, ఇటిక్యాల, అయిజ, రాజోలి, వడ్డేపల్లి, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో వర్షం కురవలేదు. వర్షం తెరపి ఇవ్వడంతో ఆయా మండలాల్లోని రైతులు, రైతు కూలీలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
Similar News
News January 16, 2026
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుతో 8వేల మందికి ఉపాధి

AP: కాకినాడలో CM CBN ప్రారంభించనున్న AM గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ₹90వేల CRతో ఏర్పాటయ్యే ఇది దేశంలో మొదటిది. 8వేల మందికి ఉపాధి కల్పించనుంది. దశలవారీగా 2030కి 1.5 MT గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ షిప్పింగ్ ఫ్యూయల్‌కు ఇది ఉపకరిస్తుంది. ఇక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ మాలిక్యూల్స్‌ను జర్మనీ, జపాన్, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు.
News January 16, 2026
ఉమ్మడి జిల్లా నీటి సమస్యలు పరిష్కరించాలి: ఎంపీ నగేశ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం 26 27 ప్యాకేజీ అసంపూర్తిగా ఉందని, దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ముప్పు గ్రామాల సమస్యలు పరిష్కరించాలన్నారు.
News January 16, 2026
గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.


