News August 23, 2025
గద్వాల: నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా: ఎమ్మెల్యే

కొందరు MLAలు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ ప్రసాద్ <<17491488>>ఐదుగురికి నోటీసులు జారీ చేశారు.<<>> ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని MLAలను ఆయన ఆదేశించారు. దీనిపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘నేను పార్టీ మారలేదు.. కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా’ అని వివరణ ఇచ్చారు.
Similar News
News January 25, 2026
ఆకర్షణీయంగా ముస్తాబైన తిరుపతి కలెక్టరేట్

గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ త్రివర్ణ విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. రాత్రి వేళల్లో కలెక్టరేట్ భవనం నలువైపులా ఈ మూడు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులు విరజిమ్ముతూ అత్యంత సుందరంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.
News January 25, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.
News January 25, 2026
విడవలూరు: 54 మంది అరెస్ట్

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.


