News March 4, 2025
గద్వాల: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. అమరవాయికి చెందిన నాగరాజు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యాపారంలో ఇబ్బందులు, ఇంట్లో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Similar News
News December 7, 2025
ఘనంగా కృష్ణా తరంగ్.. ఆటపాటలతో సందడి చేసిన యువత

కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్-2025 వేడుకలు ఘనంగా ముగిసాయి. కృష్ణా తరంగ్ పేరుతో మూడు రోజులపాటు నిర్వహించిన యూత్ ఫెస్టివల్‌లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. విశ్వవిద్యాలయం పరిథిలోని అనుబంధ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని పలు అంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు శనివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేశారు.

నంద్యాల: ‘రూ.17 కోట్లు అప్పులు చేసి.. ఐపీ పెట్టాడు’

సంజామల(M) పేరుసోములకు చెందిన వెంకటేశ్వర్లు రూ.17 కోట్లకు ఐపీ పెట్టాడు. ఈయన పలు వ్యాపారాలు చేస్తూ రూ.17,51,11,622 అప్పులు చేశాడు. నష్టాలు రావడంతో పాటు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో చేతులెత్తేశాడు. దాదాపు 40 మంది నుంచి అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవెలకుంట్ల సివిల్ జడ్జి కోర్టులో మొత్తం రూ.17 కోట్లకు శనివారం ఐపీ దాఖలు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.