News April 11, 2025

గద్వాల: పెళ్లి వేడుకలో ఘర్షణ

image

గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

Similar News

News January 20, 2026

PDPL: ‘వడ్డీ లేని రుణాల పంపిణీ వేగిరం చేయాలి’

image

పట్టణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం PR మంత్రి సీతక్కతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్ష సమావేశంలో PDPL కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పట్ల మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సత్వరం చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాల జారీ చేశారు.

News January 20, 2026

పెద్దపల్లి: ట్రాన్స్ జెండర్లకు ఉపాధి యూనిట్లు

image

పెద్దపల్లి జిల్లాలో గల ట్రాన్స్ జెండర్లకు ఉపాధి హామీ పథకం కింద రెండు యూనిట్లు అందజేశారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ) ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు రూ.1.50లక్షల లోన్స్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు, సూపర్డెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

SRCL: ‘మహిళల ఆర్థిక ప్రగతితో దేశ రాష్ట్ర ప్రగతి సాధ్యం’

image

మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.