News March 12, 2025

గద్వాల: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

image

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడిచేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. ఈసమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలపటంతో వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News April 17, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ ముంగిట తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,370 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000గా ఉంది.

News April 17, 2026

మాట్లాడే విధానం ఎంతో కీలకం

image

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్‌ డిస్కషన్లు పెడుతుంటారు. అలాంటప్పుడు తోటివారికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడకూడదు. మీరు చెప్పాలనుకున్నది వివరిస్తూనే ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలిసి చర్చ అర్థవంతంగా ముగుస్తుంది. అలాగే ఆలుమగల మధ్య కూడా ఏదైనా సమస్య వస్తే భాగస్వామికీ మాట్లాడే ఛాన్సివ్వాలి.