News February 1, 2025
గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేట్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.
News February 18, 2025
సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
News February 18, 2025
HYDలో రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు

HYD ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లతో 106 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. షేక్‌పేట్, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 78 ప్రాజెక్టులు పూర్తి కాగా, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో పనులు వేగంగా సాగుతున్నాయి.