News December 1, 2025
గద్వాల: మహిళల భద్రతకు కవచం- ఎస్పీ శ్రీనివాసరావు

మహిళల భద్రతకు షీ టీమ్ నిద్రలేని కవచంలా పనిచేస్తుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మీడియాకు షీ టీమ్ పనితీరు గురించి వివరించారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ బాధితులకు తక్షణం స్పందిస్తూ, వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన షీ టీమ్ నెంబర్ 8712670312 కు కాల్ చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

తొర్రూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.
News February 13, 2026
ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.


