News March 24, 2025

గద్వాల రాజకీయం రసవత్తరం..!

image

గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. 2023 MLA ఎన్నికల్లో BRS నుంచి గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో BRS శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సరిత నియోజకవర్గంలో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆమెకే సపోర్ట్ చేస్తోంది. ఒక వేళ ఉప ఎన్నిక వస్తే BRS, కాంగ్రెస్‌కు థగ్ ఆఫ్ వార్‌లా పోటీ ఉంటుందని టాక్. మీ కామెంట్?

Similar News

News April 25, 2025

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్‌బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.

News April 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 25, 2025

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

error: Content is protected !!