News March 11, 2025
గద్వాల: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు కథనం ప్రకారం వివరాలు.. గుర్తు తెలియని వ్యక్తి(40) రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు.
Similar News
News January 24, 2026
కామారెడ్డి: 28న 50 మంది విద్యార్థులకు శ్రీహరికోట పర్యటన

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గత ఏడాది OCTలో నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన 50 మంది పదో తరగతి విద్యార్థినులతో పాటు 30 మంది టీచర్లను ఈనెల 28న నెల్లూరు(D) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ పర్యటనకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
News January 24, 2026
భూపాలపల్లిలో రైల్వే లైన్ కొరకు కృషి చేస్తా: ఎంపీ

భూపాలపల్లి జిల్లాలో మార్కెట్ గోదాం నిర్మాణం రైతులకు ఎంతో ప్రయోజనకరమని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన ఎంపీ నిధుల ద్వారా భూపాలపల్లి నియోజకవర్గంలో రైల్వే లైన్, విద్యాలయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.
News January 24, 2026
‘సర్, ప్లీజ్ చేయి తీయండి’.. మౌనీ రాయ్‌కు చేదు అనుభవం

బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ వేడుకలో స్టేజ్ వైపు వెళ్తున్న సమయంలో ఫొటోలు తీసుకునే నెపంతో కొందరు ప్రేక్షకులు నడుముపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. “సర్, ప్లీజ్ చేయి తీయండి” అని అడిగితే వారు మరింత దురుసుగా స్పందించారని తెలిపారు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా అసభ్య సైగలతో వేధించారని పేర్కొన్నారు.


