News June 18, 2024

గద్వాల: 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించని కారణంగా 14 మందికి కలెక్టర్ సంతోష్ షోకాజ్ నోటీసు జారీచేశారు. మంగళవారం ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన ఆయన సిబ్బంది గైర్హజరయిన విషయాన్ని గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను ఆరాతీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 16, 2026

MBNR: రేపు సీఎం రాక.. భారీ బందోబస్తు

image

మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ-1, అడిషనల్ ఎస్పీలు-7, డీఎస్పీలు-10, సీఐలు-34, ఎస్సైలు-77, ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు-182, పీసీలు/వుమెన్ పీసీలు-741, హోంగార్డులు-110, వుమెన్ పీసీలు/వుమెన్ హోంగార్డులు-22, మొత్తం 1,184 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో హాజరుకానున్నారు.

News January 16, 2026

MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

image

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్‌కర్నూల్ నుంచి MBNR టౌన్‌లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.

News January 16, 2026

MBNR: CM పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు1/2

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా.. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం సమావేశానికి సంబంధించిన వాహనాలు తప్ప, సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. 1. కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు →NH 44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.