News December 13, 2025
గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News January 19, 2026
కృష్ణా: SP పేరుతో ఫేక్ ఎకౌంట్లు.. సీరియస్ అయిన పోలీసులు

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేయడమే కాకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఎస్పీ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని, ఎవరైనా డబ్బులు కావాలని మెసేజ్ చేసినా స్పందించవద్దని కోరింది. ఇటువంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని DSP సీహెచ్ రాజా తెలిపారు.
News January 19, 2026
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.