News November 6, 2025

గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

image

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.

Similar News

News January 23, 2026

కామారెడ్డి: ‘నిర్భయంగా ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’

image

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మతం, కులం, జాతి ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News January 23, 2026

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చంటి బాధ్యతలు

image

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని చంటికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా గ్రూపు రాజకీయాలు చేయవద్దని సూచించారు. పార్టీ విషయాలను నాలుగు గోడల మధ్య మాట్లాడాలని, 40 మందిలో మాట్లాడవద్దని ప్రతి కార్యకర్తకు సూచించారు.

News January 23, 2026

KMR: 4,408 ఫోన్లు రికవరీ

image

సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CIER పోర్టల్ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రికవరీ వివరాలను వెల్లడించారు. CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ₹7.05 కోట్ల విలువైన 4,408 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.