News September 12, 2025

గర్భిణులకు 100% ఏఎన్‌సీ చెకప్ చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

image

స్వస్త్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ అమలుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గురుకుల బాలికలకు ప్రత్యేక పరీక్షలు, గర్భిణులకు 100% ఏఎన్‌సీ చెకప్, ఇమ్యునైజేషన్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News December 11, 2025

మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే: రవీంద్రనాథ్ రెడ్డి

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కడప నగర మేయర్‌తో పాటు ముద్దనూరు ఎంపీపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

News December 11, 2025

గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.

News December 11, 2025

బాపట్ల: DSEOగా శ్రీనివాసరావు బాధ్యతలు

image

బాపట్ల జిల్లా DSEOగా డి.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బాపట్ల జిల్లాకు బదిలీపై వచ్చిన డి.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి మొక్కను అందజేశారు. అనంతరం DSEOగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.