News August 20, 2025
గల్ఫ్ వెళ్లే వారు జాగ్రత్త: డీఐజీ

సైబర్ నేరాలపై దృష్టిని సారించామని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలో గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు. దీనికి తగ్గట్టుగానే నేరాలు ఉన్నాయని చెప్పారు. అనధికార గల్ఫ్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఏదైనా సమస్య ఎదురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సంప్రదించాలన్నారు.
Similar News
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT
News January 16, 2026
ధురంధర్ నటికి చేదు అనుభవం

BMC ఎన్నికల్లో ధురంధర్ నటి సౌమ్యా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కు సెలవు పెట్టి మరీ నిన్న ఓటు వేయడానికి వెళ్లారు. అయితే అధికారులు దాల్మియా కాలేజ్ బూత్‌లో వివరాల్లేవని ఆమెను మరో బూత్‌కు పంపడంతో అసహనం వ్యక్తం చేశారు. ‘ఓటు వేయడం నా హక్కు, బాధ్యత. ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నా.. ఈ గందరగోళం ఏంటి? అసలు లిస్ట్‌లో నా పేరుందో లేదో చూడాలి’ అన్నారు. చివరకు ఓటేశారా లేదా అనే దానిపై స్పష్టతలేదు.
News January 16, 2026
చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


