News October 2, 2024
గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శం: ఎస్పీ
మహాత్మ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు.
Similar News
News October 15, 2024
నంద్యాల మాజీ ఎంపీ కుమార్తెకు 9 వైన్ షాపులు
వైన్ షాపుల లాటరీలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజలను అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా తొమ్మిది షాపులు దక్కాయి. చిత్తూరు జిల్లా కలికిరిలో రెండు, పీలేరులో ఓ మద్యం దుకాణాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే చిన్నమండెంలోనూ రెండు దుకాణాలు తగిలాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం గ్రామీణంలోని 32, 34, గుంతకల్లులో 79, కళ్యాణదుర్గంలో 130వ నంబరు దుకాణాలను ఆమె దక్కించుకున్నారు.
News October 15, 2024
కర్నూలు: ఒకే వ్యక్తికి 4 షాపులు దక్కాయి!
ఇటీవల వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మీడియాలో పాపులరైన ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ ద్వారా ఏకంగా 4 దుకాణాలు దక్కించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ తీయగా పుట్టపర్తిలో-1, నంద్యాలలో 3 షాపులు ఆయనకు దక్కాయి. కాగా ఆయన చవితి వేళ రూ.29 లక్షలు వెచ్చించి వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
News October 14, 2024
నంద్యాలలో నూతన బస్సులు ప్రారంభించిన ఎంపీ
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి ఫరూక్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో నూతన బస్సులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.